Minister : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు.
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. బూర్గంపాడు శివారులోని గొమ్మూరు రేవు ప్రాంతం నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్ మహమ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.