నకిలీ విత్తనాలతో నష్టపోయాం..దిగుబడి రాదంటూ రైతుల ఆవేదన

రైతులను అమాయకులను చేసి డీలర్లు నకిలీ విత్తనాలు

Update: 2024-12-19 10:45 GMT

దిశ,తల్లాడ: రైతులను అమాయకులను చేసి డీలర్లు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న వైనం. తల్లాడ మండలానికి చెందిన రైతులు సుమారు 20 ఎకరాల్లో సారా జి20 రకం మిర్చి విత్తనాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పట్టణానికి చెందిన పవన్ కళ్యాణ్ ట్రేడర్స్ నందు కొనుగోలు చేశారు.. నాటి నుంచి నేటి వరకు ఎదుగుదల లేకుండా అడుగు మేర పెరిగి కాయలు నేలకు తాకి పాచి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలతో మోసం చేసిన డీలర్ పై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి…: కటికి శ్రీరామ్ మూర్తి, మల్లవరం గ్రామం రైతు..

సుజాతనగర్ పట్టణానికి చెందిన పవన్ కళ్యాణ్ ట్రేడర్స్ డీలర్ వడ్డే పవన్ కళ్యాణ్ వద్ద మిర్చి విత్తనాలను విక్రయించి 20 ఎకరాల్లో సారా జి20 రకం మిర్చి విత్తనాలను వేశామని నాటి నుంచి నేటి వరకు ఎదుగుదల లేకుండా కేవలం అడుగు మేర ఎత్తులో ఎదిగిన మిర్చి పంట కాయలు కాచిన భూమికి తాకటం వల్ల కాయలు పూర్తిగా పాచి పోతున్నాయని ఎకరానికి రూ 1.70 లక్షలు పెట్టుబడి పెట్టామని డీలర్ వడ్డే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు మోసపోయమని తెలిపారు.

నకిలీ విత్తనాలను అంటగట్టిన డీలర్ పై చర్యలు తీసుకోవాలి..: పిన్ని వెంకటేశ్వర్లు నరసరావుపేట గ్రామ రైతు...

సుజాతనగర్ పట్టణానికి చెందిన పవన్ కళ్యాణ్ ట్రేడర్స్ డీలర్ వడ్డే పవన్ కళ్యాణ్ మా వద్దకు వచ్చి సారా g20 కొత్త రకం మిర్చి విత్తనాలని మంచి దిగుబడి వస్తుందని నమ్మబలికి సుమారు 20 రోజుల పాటు మా చుట్టూ తిరిగి ముందుగా ప్రతి ఒక్క రైతు వద్ద ఫోన్ పేరూ. 1500 కొట్టించుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్క రైతులు 1500 రూపాయలు కొట్టామని అలాగే జూన్ 6 తేదీన కొన్న విత్తనాలను ఆరు నెలలు గడిచిన ఇప్పటికే అడుగు మాత్రమే ఎత్తు పెరిగిందని చెట్టుకు కాచిన మిర్చి నేలకు తాకి పూర్తిగా పాచిపోతున్నాయని సుమారు ప్రతి ఒక్క ఎకరానికి రూ 1.70 లక్షల పెట్టుబడి పెట్టామని 20 ఎకరాల్లో వేచిన పంట పూర్తిగా నష్టపోవడం అలాగే ఎకరానికి మూడు క్వింటాలు కూడా దిగుబడి రాదు. ఇలాంటి మాయమాటలతో మోసం చేసిన డీలర్ పై చర్యలు తీసుకోవాలని తమను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులకు రైతులు ఫిర్యాదు చేయనున్నారు.


Similar News