ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంది

తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు.

Update: 2023-10-11 16:16 GMT

దిశ,ఇల్లందు : తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ని ముఖ్యమంత్రి ని చేస్తాయన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో 1600 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఇల్లందు ప్రజల చిరకాల వాంఛ అయిన ఇల్లందు బస్సు డిపో ప్రారంభం, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి ప్రభుత్వ ఐటీఐ ని మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ జీవో జారీ చేశారన్నారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకున్న రైతులకు పోడు పట్టాలను అందించారన్నారు.

    ఇల్లందు నియోజకవర్గంలో 15 వేల మందికి పైగా 60 వేల ఎకరాల పోడు పట్టాలను అందించి రాష్ట్రంలో పోడు పట్టాలు అత్యధికంగా పొందిన నియోజకవర్గంగా ఇల్లందు నిలిచిందన్నారు. మంత్రి కేటీఆర్ కేటీఆర్ ఇల్లందు మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి ఇల్లందు మున్సిపాలిటీనీ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం కల్పించారన్నారు. దశాబ్దాలుగా గార్ల, రామపురం మధ్య పెద్ద సమస్యగా ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి 15 కోట్ల రూపాయలతో మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేశారన్నారు. అతి త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ ఎస్ ప్రభుత్వం కావాలా , మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, 9 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించి ప్రజలు ఓట్లు వేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు,

     చచ్చేది లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేళ్ల కాలంలో మేనిఫెస్టో లేని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో ను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. అనంతరం నవంబర్ 1 మధ్యాహ్నం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలం కోసం జెకె సింగరేణి గ్రౌండ్ ను ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించారు. ఈ సభకు ఇల్లందు నియోజకవర్గ నుండి 70 నుండి 80 వేల మంది హాజరవుతారని, ప్రతి ఒక్క బీఆర్ ఎస్ కార్యకర్త ఎమ్మెల్యే హరిప్రియ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జెకె శ్రీను, నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వర్లు, తాత గణేష్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News