అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి
సత్తుపల్లి పట్టణ పరిధిలోని కల్పతురు రోడ్డు నందు గల అవని వెంచర్ లో రిటైర్డ్ వేటర్ని ఉద్యోగి పిల్లలమర్రి జానకిరాములు పద్మావతి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి ఆమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది.
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని కల్పతురు రోడ్డు నందు గల అవని వెంచర్ లో రిటైర్డ్ వేటర్ని ఉద్యోగి పిల్లలమర్రి జానకిరాములు పద్మావతి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి ఆమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. అదే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అమెరికన్ మాథ్యూ తో ప్రేమలో పడింది. భాషలు వేరైనా.. దేశం వేరైనా...సంప్రదాయాలు వేరైనా.. వాళ్ళ ఇరువురి ప్రేమకు ఇవ్వేమి అడ్డు రాలేదు. ఇరు కుటుంబాలను ఒప్పించారు. చక్కగా హిందూ సంప్రదాయ పద్ధతిలో సత్తుపల్లి పట్టణంలో ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అంతే కాదండోయ్ పెళ్ళిలో తెలుగు సినిమా పాటలను అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు. ఏది ఏమైనా ప్రేమకు ఏది అడ్డు కాదని నిరూపించుకున్నారు. ఈ చూడ ముచ్చటైన జంటను చూసి ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.