బీఆర్ఎస్ నాయకత్వానికే మతిభ్రమించింది : రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున పాల్గొనటం చూసి బీఆర్ఎస్ నాయకత్వానికి మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ విమర్శించారు.

Update: 2023-04-11 10:54 GMT

దిశ, వైరా : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున పాల్గొనటం చూసి బీఆర్ఎస్ నాయకత్వానికి మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ విమర్శించారు. వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంగులేటిని విమర్శించే స్థాయి, అర్హత ఎమ్మెల్యే రాములు నాయక్ కు లేవని ఎద్దేవా చేశారు. పొంగులేటిది ధన బలంకాదు జనబలం అని స్పష్టం చేశారు. జనబలాన్ని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే రాములు నాయక్ గతాన్ని మొత్తాన్ని మర్చిపోయారన్నారు. వైరా నియోజకవర్గ ప్రజలు విజ్ఞులని ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రాములు నాయక్ మాట్లాడిన ప్రతిమాటకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైరా అసెంబ్లీ నియోజకవర్గ పొంగులేటి అభ్యర్థిని బానోతు విజయ భాయి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్, మత్స్య సహకార సంఘ అధ్యక్షుడు షేక్ రహీం, పణితి సైదులు, మచ్చా రామారావు, కన్నెగంటి హుస్సేన్, జాలాది రామకృష్ణ, ఐలూరి మోహన్ రెడ్డి, పర్సా వెంకట్ గౌడ్, మేడిశెట్టి కృష్ణ, బొగ్గుల వాసిరెడ్డి, గుగులోతు విజయ్, షేక్ షావుద్దీన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News