రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా సత్తుపల్లి మారనుందా..?

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన సత్తుపల్లి గడ్డ ఈసారి మలుపు తిరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో.. Special Story on Ponguleti Srinivas Reddy

Update: 2023-03-05 03:18 GMT

దిశ, సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన సత్తుపల్లి గడ్డ ఈసారి మలుపు తిరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం ఎందరో రాజకీయ ఉద్దండులు అందించిన సత్తుపల్లి నియోజకవర్గ రాజకీయం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన పార్టీ ఆవిర్భవిస్తున్న తరుణంలో పొంగిలేటి పేరు ప్రముఖంగా వినపడుతున్న దృష్ట్యా సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని అనుచరులుగా ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు, త్వరలో జరగబోవు సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం ఉగాది పండుగకు ముందుగానే లేదా ఉగాది తర్వాత గానీ సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం సభ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు ఆ సభా వేదిక ద్వారా పొంగిలేటి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో సామాజిక వర్గాలతోపాటు యువకులు ఉత్సాహవంతుడు, మచ్చలేని నాయకులను సత్తుపల్లి నుంచి పోటీలో దించి గెలుపు సాధించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన ఆవిర్భావ పార్టీని ఆధారంగా సత్తుపల్లిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం జిల్లాతోపాటు సత్తుపల్లి నియోజకవర్గంలో బందు గణం వివిధ సామాజిక వర్గాల ముఖ్య నాయకులతోపాటు బలమైన ప్రజానీకం ఉండటం విశేషం. సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనంలో భారీ జన సమీకరణ చేసి పొంగులేటి వర్గం సత్తా చాటాలని విశేష కృషి చేస్తున్నట్లు విశ్వసినీయ సమాచారం.

Tags:    

Similar News