'అంతా మా ఇష్టం...'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యోగ నియామకాలు గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్... Special Story

Update: 2023-02-23 12:10 GMT

దిశ, ఖమ్మం సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యోగ నియామకాలు గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్, గురుకులాలు, జూనియర్ లెక్చరర్లు, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులను వేల సంఖ్యలో సంఖ్యలో భర్తీ చేస్తున్నది. ఈ నియామకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. జిల్లాల వారీగా సుమారుగా లక్ష నుండి రెండు లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమాజం కోసం పలువురు అభ్యర్థులు అద్దె రూములలో, ప్రైవేటు స్టడీ హాల్లో , ప్రభుత్వం వారు కేటాయించిన జిల్లా గ్రంధాలయాలు, మండల గ్రంధాలయాల్లో వారి వారి ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రంథాలయాల్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎనిమిది వేల నుండి పదివేల వరకు ఉంటారని అంచనా. కానీ ఒక జిల్లా గ్రంధాలయం సుమారు 2000 మంది తమ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మండల గ్రంధాలయాలు ఉన్నాగానీ అక్కడ సిబ్బంది రూ. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నా గానీ సదరు ఉద్యోగి మాత్రం విధులు సరిగా నిర్వర్తించకుండా అటెండర్, స్వీపర్ల ద్వారానే వారి ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నది. ఇందులో కూసుమంచి ఖమ్మం రూరల్, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, బోనకల్లు, నేలకొండపల్లి, మధిర, వైరా, చింతకాని మండలాల్లో దిశ పేపర్ స్థూల పరిశోధనలో వెల్లడయ్యాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకవైపు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుపుతుంటే జిల్లా గ్రంధాల ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అదనపు మరుగుదొడ్లు, అదనపు స్టడీ హాలు నిర్మించి నిరుద్యోగులకు సౌకర్యాలు కల్పించినా గానీ మండల గ్రంధాలయాల ఉద్యోగులు స్వీపర్, అటెండర్ తో పనులు కొనసాగిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా దిశ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కారుణ్య నియామకంగా ఉద్యోగం పొందిన ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని జిల్లా నిరుద్యోగులు వేడుకుంటున్నారు. దీనంతటి కారణం జిల్లా డిప్యూటీ లైబ్రరీ పర్యవేక్షణ లోపమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక మంత్రి స్పందించాల్సిందిగా జిల్లా నిరుద్యోగులు కోరుతున్నారు.

Tags:    

Similar News