Sp :హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి

నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడే పోలీసులకు సహాయకారులుగా పనిచేసే హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

Update: 2024-11-02 14:29 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడే పోలీసులకు సహాయకారులుగా పనిచేసే హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని హోంగార్డ్స్ సమస్యలను అసోసియేషన్ తరపున వినతిపత్రం రూపంలో ఎస్పీ కి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్స్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

     జిల్లాలోని ఆస్పత్రుల్లో, విద్యా సంస్థల్లో ఫీజుల రాయితీ గురించి యాజమాన్యాలతో చర్చిస్తామని తెలిపారు. జిల్లాలో పనిచేసే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ క్రమశిక్షణతో, సమయపాలన పాటిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఉద్యోగ పరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, ఎంటీఓ సుధాకర్, హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News