పొంగులేటి వెంటే మా ప్రయాణం.. బీఆర్ఎస్ పార్టికి రాజీనామా చేసిన కౌన్సిలర్లు
సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ హోదాలో కనీసం ఫోటో కాల్ హోదా కూడా పాటించకుండా బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు, అవహేళనలే మిగిలాయని ఆరోపిస్తూ.. సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి తో మరో ఇద్దరు వార్డు కౌన్సిలర్లు రాజీనామా చేశారు.
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ హోదాలో కనీసం ఫోటో కాల్ హోదా కూడా పాటించకుండా బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు, అవహేళనలే మిగిలాయని ఆరోపిస్తూ.. సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి తో మరో ఇద్దరు వార్డు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తోట వెంకటరావు వారి స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ హోదాలో వార్డులో కనీస మౌలిక వసతులు కల్పించడానికి చాలాసార్లు అవమానాలు అవహేళనలే ఎదుర్కొనవలసి వచ్చిందన్నారు.
ప్రతి పనిలో ఇబ్బందులకు గురి చేయటం, చాలా బాధాకరం అన్నారు. కొంతమంది స్వార్థం రాజకీయ నాయకులతో కలిసి పని చేయడం ఇష్టం లేనందున బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ.. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మున్సిపాలిటీ ఆరో వార్డు కౌన్సిలర్ తోట సుజల రాణి, 16 వ వార్డు కౌన్సిలర్ దూదిపాళ్ళ రాంబాబు, 20 వ వార్డు కౌన్సిలర్ మందపాటి పద్మజ్యోతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలపరిచిన అభ్యర్థి కొండూరు సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతనేని అప్పారావు, గౌరి గూడెం సర్పంచ్ మందపాటి ముత్తా రెడ్డి, తోట గణేష్, కొత్తూరు కోటేశ్వరరావు, మందపాటి రవీందర్ రెడ్డి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More: ‘క్షమాపణ చెప్పకపోతే శవాలు కూడా దొరకవు’.. ఖమ్మంలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం