ట్రాక్టర్ బోల్తా.. 20 మందికిపైగా కూలీలకు గాయాలు

Update: 2023-08-06 14:00 GMT

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాలం ప్రకారం.. బీహార్ రాష్ట్రం నుండి వచ్చి దమ్మపేటలో నివసిస్తున్నారు. అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో పని నిమిత్తం ఆదివారం ఉదయం దమ్మపేట వైపు నుండి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అప్పారావుపేట రాళ్ల చెరువు మలుపు దగ్గరకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడింది. దీంతో20 మందికి పైగా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.


అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన గ్రామస్తులు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ సర్పంచ్ దారా యుగంధర్ క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం, సత్తుపల్లి ఆస్పత్రులకు తరలించారు. కూలీలంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదం విషయంపై పోలీసులను సంప్రదించగా సాయంత్రం వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ప్రమాదకరంగా మారిన మూలమలుపులు..

దమ్మపేట నుండి అప్పారావుపేట రోడ్డులో మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటివరకు ఆ రోడ్డులో అనేక ప్రమాదాలు జరగగా పలువురు మృతి చెందారు, అధికారులు కూడా నామమాత్రంగా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరిగే ప్రదేశాలు, భారీ మూలమలుపులు దగ్గర స్పీడ్ బ్రేకర్లు, యాక్సిడెంట్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు.


Similar News