రామయ్యకు రు. 40 లక్షల రత్నాంగి సమర్పణ..
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రు.40 లక్షల విలువ చేసే 51 వేల రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలను హైదరాబాద్ కు చెందిన పిన్నమనేని బాల మురళీ కృష్ణ, శాంతి దంపతులు సమర్పించారు.
దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రు.40 లక్షల విలువ చేసే 51 వేల రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలను హైదరాబాద్ కు చెందిన పిన్నమనేని బాల మురళీ కృష్ణ, శాంతి దంపతులు సమర్పించారు. శనివారం యాగశాలలో సంప్రోక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి ఆలయ ఈవో రమాదేవికి రత్నాంగిని ఉభయదాతలు అందజేశారు. స్వామి వారికి ఇప్పటికే స్వర్ణ కవచం, ముత్యాల కవచం ఉండగా.. ఇప్పుడు రత్నాలు కవచం రావడంతో వారంలో ఒక రోజు స్వామి వారు రత్నాంగి కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం స్వామి వారికి అభిషేకం అనంతరం ఈ కవచాన్ని ధరింపజేయనున్నారు.