19వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 19వ రోజుకు చేరింది.
దిశ, కొత్తగూడెం : సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 19వ రోజుకు చేరింది . వినూత్నంగా ఉద్యోగులంతా గాంధేయ మార్గంలో తలకు తెల్ల టోపీలు ధరించి నిరసన తెలిపారు.కేజీబీవీ లలో రోజుకు ఇద్దరు టీచర్ల చొప్పున బాలికల సంరక్షణార్థం విధులు నిర్వహిస్తున్న ప్పటికీ ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని అన్ని కేజీబీవీలకు స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయినీలను ఇన్చార్జిలుగా నియమించడంతో కేజీబీవీలకు వెళ్లే ఇద్దరు టీచర్లు కూడా రేపటినుండి విధులకు హాజరు కారని, ఈరోజు నుంచి బాలికల సంరక్షణతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి కి వినతి పత్రం అందజేశారు.
ఈనెల కేజీబీవీలకు కావాల్సిన సరుకులకు ఇండెంట్ పెట్టలేదని బియ్యం ఎంత కావాలో అనే ప్రపోజల్ కూడా కేజీబీవీ ల స్పెషల్ ఆఫీసర్లు డిఈఓకి విషయాన్ని తెలియపరిచారు.ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించబోమని తప్పనిసరి పరిస్థితుల్లో మాకు జీవో ఇచ్చి హామీ నిలబెట్టుకుంటే గాని సమ్మె విరమణ చేయమని ఉద్యోగులు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్, చందు మహిళా అధ్యక్షురాలు ఏం తులసి, జిల్లాలోని అన్ని కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు అకౌంటెంట్లు సోని, రమ, లక్ష్మి ఇతరులు పాల్గొన్నారు.