అర్ధరాత్రులు అధిక లోడు లారీలు...

మణుగూరు మండలం లో అర్ధరాత్రులు అధిక లోడు

Update: 2024-12-29 02:56 GMT

దిశ,మణుగూరు : మణుగూరు మండలం లో అర్ధరాత్రులు అధిక లోడు లారీలు యధేచ్చగా తిరుగుతున్నాయి.పెద్ద పెద్ద లోడులతో లారీలు అర్ధరాత్రులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయి.ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనదారులు ఆదమరచి కను రెప్ప మూస్తే ఈ పెద్ద లారీలకు బలి అవ్వాల్సి వస్తోంది.అంతేగాక లారీలకు ఉన్న లైట్లకు ఎదురుగా వచ్చే వాహనదారులకు కళ్ళల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు.

కనీసం అంబులెన్స్ లకు,అత్యవసర వాహనాలకు కూడా దారి ఇవ్వడం లేదని వినపడుతోంది.ఇలాగైతే రోడ్ల పైన ప్రమాదాలు జరగకపోతే..?ఇంకేం జరుగుతాయి అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.అసలే మణుగూరు రోడ్డు దుస్థితి అద్వానంగా తయారైందంటున్నారు.ఇంకా ఈ రోడ్డుపై అధిక లోడుతూ ఉన్న లారీలు వెళ్తుడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు.రాత్రులు ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు ప్రాణ భయంతో వణుకుతున్నారని అంటున్నారు.ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి రోడ్డుపై అధిక లోడుతో ఉన్న లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Similar News