వివేకానంద బోధనలు నేటి తరానికి స్ఫూర్తి దాయకం కావాలి.. స్వామి వినిచలానంద మహారాజ్..

వివేకానంద (మూర్తి త్రయం) బోధనలు నేటి భక్తులకు స్ఫూర్తిదాయకం కావాలని విజయవాడ రామకృష్ణ మిషన్ నిర్వాహకులు స్వామి వినిత్ చలానంద మహారాజ్ అన్నారు.

Update: 2024-12-29 15:59 GMT

దిశ, సత్తుపల్లి : వివేకానంద (మూర్తి త్రయం) బోధనలు నేటి భక్తులకు స్ఫూర్తిదాయకం కావాలని విజయవాడ రామకృష్ణ మిషన్ నిర్వాహకులు స్వామి వినిత్ చలానంద మహారాజ్ అన్నారు. రామకృష్ణ - వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో రెండు రోజులు పాటు అత్యంత వైభవంగా జరిగిన 6వ భక్త సమ్మేళనం ఆదివారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు చెందిన రామకృష్ణ మిషన్ స్వామీజీలు, మాతాజీలు, రామకృష్ణ- వివేకానంద సేవా సమితి బాధ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది రామకృష్ణ మఠం స్వామీజీలు, మాతాజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆలోచింపజేశారు. ఆదివారం వినిచలానంద మహారాజ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మూర్తి త్రయం ఆశయ సాధన కృషి చేయాలని కోరారు.

సమాజ సేవ చేయాలి..

భక్తులు సేవాతత్వం అలవర్చుకోవాలని, తమతో పాటు సమాజ సేవను సంఘటితంగా చేయాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ నిర్వాహకులు యోగిశానంద మహారాజ్ పిలుపునిచ్చారు. శ్రీరామకృష్ణ , ఇక వివేకా నందులవారు క్రిస్టియన్, ముస్లిం మతాలను కూడా సాధన చేసి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారన్నారు. ఆధ్యాత్మిక సంపదను , అనుభూతులను ప్రజలకు పంచి పెట్టాలని రామకృష్ణ- వివేకానంద సేవా సమితి నిర్వాహకులకు సూచించారు.

మాతృత్వం నిస్వార్ధానికి మారుపేరు...

గుంటూరు శారద మఠం నిర్వాహకరాలు త్యాగనిస్ట ప్రాణ మాతాజీ మాతృత్వం నిస్వార్థానికి మారుపేరు అని పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించిన దేశం ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్వామీజీలు, భక్తులు, రామకృష్ణ మఠం నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో స్వామి బోధమయానంద, అధ్యక్షులు, రామకృష్ణ మఠం, హైదరాబాద్. స్వామి కంటానంద, స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి ఎగిశానంద్ మహారాజ్, స్వామి సేవానంద్ మహారాజ్, స్వామి పూజ నంద జీ మహారాజ్, స్వామి సన్నివాసానంద మహారాజ్, సత్య ప్రసాద్, సత్య చైతన్య, ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.


Similar News