దిశ క్యాలెండర్ ఆవిష్కరణలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ..

వార్త సమాచారం వేగంగా అందించడంలో "దిశ" ముందుంటుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.

Update: 2025-01-01 07:26 GMT

దిశ, అశ్వారావుపేట : వార్త సమాచారం వేగంగా అందించడంలో "దిశ" ముందుంటుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. "దిశ" దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండగులపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం ఆవిష్కరించారు. ముందుగా నియోజకవర్గ "దిశ" టీం ఎమ్మెల్యే జారెకు పూల బొకేని అందించి శాలువాతో సత్కరించారు. తర్వాత దిశ కేక్ కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దిశ"యాజమాన్యానికి సిబ్బంది పాఠకులకు.. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీడియా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుపు వేగంతో వార్తల అందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న "దిశ" దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ అశ్వారావుపేట కాన్స్టెన్సీ రిపోర్టర్ పీటర్సన్ దిలీప్ ఖన్నా, అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ చిక్కం గోపాలకృష్ణ, దమ్మపేట రిపోర్టర్ గోళ్ళ గోపికృష్ణ యాదవ్, అన్నపురెడ్డిపల్లి రిపోర్టర్ చిట్టి బొమ్మల కోటేశ్వరరావు.. రాజకీయ ప్రముఖులు కొయ్యాల అచ్యుత్ రావు, కోటగిరి సత్యంబాబు, కాసాని నాగప్రసాద్, ఎర్రగొర్ల రాధాకృష్ణ, ఎర్ర వసంతరావు, దొడ్డా భాస్కర్, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Similar News