పత్రికా రంగంలో దిశ ఓ సంచలనం

పత్రిక రంగంలో దిశ ఓ సంచలనం సృష్టించిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.

Update: 2025-01-03 14:59 GMT

దిశ, ఇల్లందు : పత్రిక రంగంలో దిశ ఓ సంచలనం సృష్టించిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దిశ దినపత్రిక క్యాలెండర్​ను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలుస్తూ నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిందన్నారు. సమాజంలో జరిగే వార్తలను అప్పుడే పాఠకులకు అందిస్తూ తనదైన మార్కును ప్రదర్శిస్తుందన్నారు.

    డైనమిక్ ఎడిషన్ లైన ఒంటిగంట, నాలుగు గంటలకు, ఏడు గంటలకు ఆరోజు జరిగిన వార్తలు సంక్షిప్తంగా అందిస్తూ పత్రిక రంగంలో ముందు వరుసలో ఉందన్నారు. దిశ దినపత్రిక వచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందని ప్రశంసించారు. ప్రజా సమస్యలపై కథనాలతో పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ రాంబాబు, మడుగు సాంబమూర్తి, సూర్యం, వార్త రాజేష్, సాక్షి నాగేష్, ఆంధ్రజ్యోతి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బత్తుల రాధాకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Similar News