Breaking News : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎనకౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో(Chatthisghar) ఎన్కౌంటర్ల(Encounter) పర్వం కొనసాగుతోంది. గరియబాద్(Gariabad) లో శుక్రవారం మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది.

Update: 2025-01-03 09:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో(Chatthisghar) ఎన్కౌంటర్ల(Encounter) పర్వం కొనసాగుతోంది. గరియబాద్(Gariabad) లో శుక్రవారం మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియబాద్ జిల్లాలో నేటి ఉదయం ప్రత్యేక దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. కూంబింగ్ చేపడుతున్న పోలీసులు కూడా ఎదురు దాడులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. గరియబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందిందన్నారు. అలాగే ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News