సీపీఐ పార్టీ ఉన్నదే పేదల కోసం : కూనంనేని సాంబశివరావు
మణుగూరు మండలం రామానుజరం గ్రామంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ
దిశ,మణుగూరు : మణుగూరు మండలం రామానుజరం గ్రామంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్లోజు అయోధ్య ఆధ్వర్యంలో పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.శనివారం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుల్లోజు అయోధ్య, షాబీర్ పాషా పాల్గొన్నారు.అనంతరం అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ముందుగా పార్టీ అమరవీరులకు తన ఘన నివాళులర్పించారు.సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.సీపీఐ పార్టీ అంటే పేద ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీని,ఈపార్టీ అంటే ఎంతో అభిమానం అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీలో అనేక ఉద్యమాలను చేసి ఎంతో మంది విద్యార్థులకు అనేక సేవలు అందించానని గుర్తు చేశారు.కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే ఎంతగానో గౌరవమని తెలియజేశారు.అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ముందుగా పార్టీ కోసం అమరులైన అమరవీరులకు తన ఘన నివాళుర్పించారు.పేదోడి కోసమే సీపీఐ పార్టీ పుట్టిందని,పేద బిడ్డలా కోసమే పార్టీ పోరాటాలు,ఉద్ద్యమాలు చేస్తుందని ఆయన తెలిపారు. పేదవాడిని సీపీఐ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియాజేశారు.పేద ప్రజల సమస్యలతోనే సీపీఐ పార్టీ పోరాడుతుందన్నారు.ఈ శతాబ్ది ఉత్సవాలలో పార్టీ నాయకులు షాబీర్ పాషా,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్,కాంగ్రెస్,సీపీఐ మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.