గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి : సత్తుపల్లి ఎమ్మెల్యే

వివేకానందుని స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గెలుపే ధ్యేయంగా పని చేయాలని

Update: 2024-12-28 10:47 GMT

దిశ,సత్తుపల్లి : వివేకానందుని స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గెలుపే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,అంతకుముందు సత్తుపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి సభా వేదిక వద్దకు విద్యార్థులతో భారీ ప్రదర్శన స్థానిక మాధురి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించటం జరిగింది. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆరవ భక్త సమ్మేళనం మొదటి రోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఈ సభలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ, అపజయాలకు కృంగిపోకుండా ఒక లక్ష్యంతో పని చేయటం వల్లనే తాను సత్తుపల్లి మొట్ట మొదటి మహిళ ఎమ్మెల్యే కాగలిగాలని తెలిపారు, లక్ష్యంతో పని చేస్తే విజయ తీరాలను చేరవచ్చని విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు, అనంతరం స్వామి బోధ మాయనందిజీ మాట్లాడుతూ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన స్వామి వివేకానందుని స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.

 రామకృష్ణ మిషన్ నిర్వాహకులు స్వామి శతక కంఠానంద మహారాజ్ ఏకాగ్రత రహస్యం అంశంపై మాట్లాడారు. జ్ఞాన సంపాదనకు ఏక మార్గం ఏక గ్రతను కలిగి ఉండటమేనని వివరించారు. ధ్యానం ఏకాగ్రత ను పెంపొందుతుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనం పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు, మధ్యాహ్నం విద్యార్థులుచే యువ సమ్మేళనం జరిగింది. శ్రీ రామకృష్ణ వివేకానంద బావ జాలం జీవిత చరిత్రకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి డివిజన్ లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం, రామకృష్ణ మిషన్, నిర్వాహకులు సభ్యులు విద్యార్థులు ఆధ్యాత్మిక సంస్థల బాధ్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News