పామాయిల్ కు కనీస మద్దతు ధర కల్పించండి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను శుక్రవారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి తెలంగాణ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-09-06 11:58 GMT

దిశ, అశ్వారావుపేట : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను శుక్రవారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి తెలంగాణ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ రైతులకు, ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి లాగే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర లభించక ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రమంత్రికి వివరించారు.

    గతంలో టన్ను రూ. 20 వేలు ఉండగా ఇటీవల కాలంలో కస్టం డ్యూటీ ఎత్తివేశారని తెలిపారు. కస్టం డ్యూటీని తగ్గించిన క్రమంలో టన్ను ధర రూ.12 వేలకు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కనీసం మద్దతు ధర రూ.20 వేలు ఉండేలా చూడాలని కోరారు. అదేవిధంగా తెలంగాణకు కోకోనట్ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రైతు నాయకులు బండి భాస్కర్ ఉన్నారు. 

Tags:    

Similar News