Minister Ponguleti : ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-08-04 09:33 GMT

దిశ,నేలకొండపల్లి : విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని గువ్వలగూడెంలో ఆదివారం హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షలు ఉచిత వైద్యం అందించించనుందన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదల, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉందని, 31 వేల కోట్ల రూపాయలు రుణమాపీ చేస్తుందన్నారు.

    ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆనాడు గొప్పలు చెప్పున ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ధరణి పై అబద్ధాలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4 లక్షల 50 వేల ఇళ్లు కట్టబోతున్నామని ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అసైన్ భూములకు పట్టాలు ఇచ్చామని,గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతామన్నారు. ఏడు నెలలు పూర్తి కాకుండానే ఏం చేయలేదని ప్రతి పక్ష పార్టీ నాయకులు అంటున్నారు. గత ప్రభుత్వ పాలనతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని,

    కాంగ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు వచ్చింది, నీళ్లు వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. ఆడ బిడ్డలు,రైతన్నల మోములో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం చెన్నారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొడాలి గోవిందరావు, వి.నెల్లూరి భద్రయ్య,వెన్నుపూసల సీతారాములు, వల్లలా రాధాకృష్ణ, కుక్కల హనుమత్ రావు, నవీన్, రమేష్, బోయిన వేణు, నంబూరి నరేష్, బచ్చలకురి నాగరాజు, కడియాల నరేష్, శ్రీనివాస్ రెడ్డి, బొందయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News