కేటీపీఎస్‌ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లు కూల్చివేసిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ పాత ప్లాంట్ కర్మగారంలో 102 మీటర్ల ఎత్తులో ఉన్న ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు.

Update: 2024-08-05 05:55 GMT

దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ పాత ప్లాంట్ కర్మాగారంలో 102 మీటర్ల ఎత్తులో ఉన్న ఎనిమిది కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా సోమవారం జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూల్చివేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన కేటీపీఎస్ కర్మాగారం దేశ విదేశాలకు విద్యుత్ అత్యధికంగా ఉత్పత్తి చేసే కేంద్రంగా పాల్వంచకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో కాలం చెల్లిన యూనిట్లు కావడంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశాల మేరకు కూల్చివేత ప్రక్రియ రెండు సంవత్సరాలు కొనసాగింది. కూలింగ్ టవర్లు కాలపరిమితి పూర్తి కావడంతో తాజాగా కర్మాగారానికి ఆయువుపట్టుగా నిలిచే ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు.

Tags:    

Similar News