అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు..పంపిణీకి సిద్ధం చేస్తున్న అధికారులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు యూనిఫాం

Update: 2024-10-25 03:38 GMT

దిశ,అశ్వారావుపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు యూనిఫాం అందిస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే యూనిఫాం పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 823 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 7431మంది చిన్నారులను అధికారులు గుర్తించారు. వీరిలో 3776 మంది బాలురు, 3655 మంది బాలికలు ఉన్నారు. మలి విడతలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారులందరికీ ప్రభుత్వం యూనిఫాం అందజేయనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం అందించటానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

ఇప్పటి వరకు పాఠశాలల స్థాయి విద్యార్థులకు అందించే యూనిఫాంను అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పంపిణీ చేయాలని ఆలోచన చేసింది. యూనిఫాం దుస్తుల్లో చిన్నారులు సందడి చేయనున్నారు. యూనిఫాంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూడా కనిపించనున్నారు. ఇందుకు అవసరమైన వస్త్రాన్ని ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపించింది. దస్త్రాన్ని మహిళా సంఘాల సభ్యులు కుడుతున్నారు. మరికొద్ది రోజులోనే సీఎం రేవంత్ రెడ్డి.మంత్రుల నేతృత్వంలో లాంఛనంగా యూనిఫాం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూనిఫాం పంపిణీతో చిన్నారులను ఆకర్షించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంగన్వాడీ చిన్నారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆరేళ్ళలోపు చిన్నారులకు..

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న 3 నుండి 3 ఏళ్ళ లోపు చిన్నారులకు యూనిఫాం అందనుంది. మొదటి విడతలో కో- లోకేటేడ్ అంగన్వాడీ కేంద్రాల్లో (ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు) చిన్నారులకు యూనిఫాం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,080 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో626లోకేటేడ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 7,431 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 3776 మంది బాలురు, 3655 మంది బాలికలు ఉన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం తో ప్రాథమిక విద్య అందించడానికి మూడు దశాబ్దాల క్రితం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వివిధ రకాల దుస్తులు ధరించి చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. చిన్నారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం వినూత్న ప్రయోగాలతో యూనిఫాం అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇక నుండి చిన్నారులు యూనిఫాం ధరించి అంగన్వాడీ కేంద్రాలకు రావలని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చిన్నారికి రెండు జతల యూనిఫాంను అందజేయనున్నారు.

ఆకర్షించే డిజైన్లు..

చిన్నారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు రకాలు, డిజైన్లలో యూనిఫాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. బాలురకు చొక్కా, నిక్కరు, బాలికలకు గౌను డిజైన్ చేసింది. ఈ మేరకు మహిళా సంఘాలు యూనిఫాంను కుడుతున్నారు. ఒక్కో జత యూనిఫాంను కుట్టడానికి ప్రభుత్వం బాలురకు రూ.80 లు, బాలికలకు రూ.60 లు చొప్పున చెల్లిస్తుంది. యూనిఫాంలను సిద్ధం చేసేందుకు మహిళా సంఘాల సభ్యులు శరవేగంగా కుడుతున్నారు. దాదాపు యూనిఫామ్ కుట్టడం చివరి దశకు చేరుతుంది. అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా యూనిఫాం పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సైతం ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లాల్లో మంత్రులు పంపిణీని ప్రారంభించిన వెంటనే చిన్నారులకు అందించటానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. యూనిఫాం తో చిన్నారులు మరింత మురిసిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా యూనిఫాంలో తమ పిల్లలను చూసి సంతోషంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపనున్నారు.

త్వరలోనే చిన్నారులకు యూనిఫాం పంపిణీ : స్వర్ణలత లెనినా, డీడబ్ల్యువో, కొత్తగూడెం

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వస్త్రాలను జిల్లాకు పంపించింది. మహిళా సంఘాల కుట్టిస్తున్నాము. దాదాపు కుట్టడం కూడా పూర్తి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభించగానే చిన్నారులకు అందిస్తాము.


Similar News