హైదరాబాద్ టూ భద్రాచలం వరకు రివర్స్ స్కేటింగ్

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు గర్ల్స్, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇద్దరు ఇద్దరు చిన్నారులు నడుం బిగించారు.

Update: 2024-10-24 12:18 GMT

దిశ, భద్రాచలం : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు గర్ల్స్, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇద్దరు ఇద్దరు చిన్నారులు నడుం బిగించారు. హైదరాబాద్​ నుంచి భద్రాచలం వరకు 300 కిలోమీటర్లు ఆగకుండా రివర్స్ స్కేటింగ్ చేసి ఔరా అనిపించారు. హైదరాబాద్​ లో 8వ తరగతి చదువుతున్న రాజేష్ కుమార్, 7వతరగతి చదువుతున్న ఉమేష్ కుమార్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరు గత మూడు సంవత్సరాలుగా స్కేటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

    జాతీయ జెండా చేతబూని గురువారం ఉదయం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రివర్స్ స్కేటింగ్ (వెనక్కి తిరిగి స్కేటింగ్ చేయడం) మొదలుపెట్టారు. ఇప్పటి వరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఇటువంటి సాహసం ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు స్కేటింగ్ చేయనున్నట్లు వీరి తండ్రి కలకోట నవీన్ కుమార్ తెలిపారు. అలాగే రాజేష్ కుమార్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ క్యూబ్ సాల్వింగ్ చేసి రికార్డు సాధించాడని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీన ఖమ్మంలోని రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో అభినందన సభ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

Tags:    

Similar News