భద్రాద్రి రామయ్య సేవలో గవర్నర్.. అత్యంత బందోబస్తు మధ్య పర్యటన

తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని

Update: 2024-10-25 04:33 GMT

దిశ, భద్రాచలం : తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం చేరుకొని బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి పొందారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రామాలయం కార్యనిర్వాహణాధికారి రమాదేవి గవర్నర్ కు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించారు. మొదటిసారిగా భద్రాచలం వచ్చిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అర్చక స్వాములు ఆలయ విశిష్టత గురించి తెలియజేశారు. వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అత్యంత భద్రత నడుమ గవర్నర్ పర్యటన సాగగా, రామాలయం దర్శనం అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 పడకల తలసేమియా, సికిల్సెల్ అనీమియా వార్డ్ ప్రారంభించారు.గవర్నర్ వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Similar News