ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మృతి..లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

ఒరిస్సా రాష్ట్రం కందమాల్ జిల్లా, బలి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని

Update: 2024-10-25 07:22 GMT

దిశ,భద్రాచలం : ఒడిస్సా రాష్ట్రం కందమాల్ జిల్లా, బలి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడంగ్ అటవీ ప్రాంతంలో  పోలీసులకు,మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఒక ఆయుధం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు, ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

రు. 20 లక్షల రివార్డ్ కలిగిన ఆరుగురు మావోల లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు.వీరిపై రూ. 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.వీరంతా గతంలో పలు సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

సుకుమా జిల్లాలో భీకర పోరు..

ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా,కంగాల్ తొంగ అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్పీ కిరణ్ చోహన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.


Similar News