నీలాంటోళ్లను చాలామందినే చూశా.. ఆగు నీ సంగతేంటో చెప్తా: ఎంపీటీసీని బెదిరిస్తున్న ఎమ్మెల్యే! (వీడియో)

దిశ, నేలకొండపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికైన పెన్షన్ లబ్ధిదారులకు ....MLA Warning to MPTC?

Update: 2022-09-02 05:47 GMT

దిశ, నేలకొండపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికైన పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందించే మంజూరు పత్రాలతోపాటు ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రైతు వేదికలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తన సందేశంతో కూడిన కర పత్రం ఇస్తున్నారు. దీనిపై మీరు ఇలా చేయోచ్చా అంటూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ఎంపీటీసీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయా..? అంటూ ఎంపీటీసీ ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇలాంటోళ్లను చాలామందిని చూశాను, జాగ్రత్తగా మాట్లాడకపోతే నీ సంగతేంటో చేప్తామంటూ హెచ్చరించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన భర్త (వీడియో) 


నేలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన పింఛన్ దారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు. మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కరపత్రంతోపాటు పాలేరు ఎమ్మెల్యేకు సంబంధించిన కరపత్రాన్ని జతకలిపి పంపిణీ చేస్తున్నారు. దీంతో నేలకొండపల్లి ఎంపీటీసీ బొడ్డు బొందయ్య పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరారు. ప్రభుత్వ కరపత్రంతో పాటు ఎమ్మెల్యే స్వంత కరపత్రం పంపిణీ చేయొచ్చా అంటూ బొందయ్య పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరుతుండగా ఎమ్మెల్యే అనుచరులు ఎంపీటీసీపై మండిపడ్డారు. మా ఇష్టం మేము అంతే పంచుతాం, ఎమ్మెల్యే కు సంబంధించిన కరపత్రం పంచితే ఏమైతది.. పంచకూడదా..? మర్యాదగా, జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, లేకుంటే చూస్తామంటూ హెచ్చరించినట్లు వీడియోలో ఉంది.

ఆ సమయంలో స్పందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఎంపీటీసీ బొడ్డు బొందయ్యను చూసి ఏంటీ నీ గోల ఏంటీ..? ఎందుకు గొడవ చేస్తున్నావు, పంచితే తప్పేంటి, నీలాంటోళ్లను చాలా మందిని చూశామంటూ అన్నారు. దీంతో ఇదేంది సార్, నేను అడిగింది పంచాయతీ కార్యదర్శిని, ఆయన వివరణ తెలుసుకుంటున్నాను. మీ వాళ్లే నన్ను బెదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేకు చెబుతూ ఈ కరపత్రం పంచోచ్చా, పంచకూడదా అని పంచాయతీ కార్యదర్శికి చెప్పుకునే అవకాశం కూడా సర్పంచ్, ఎంపీటీసీలకు లేదా..? అని ప్రశ్నించారు. అలాగే మంజూరు పత్రాలు పంచాయతీ కార్యదర్శి ఇస్తారని ఎమ్మెల్యేగా మీరే చెబుతున్నారు, మరీ ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్, ఎంపీటీసీలం ఏం చేయాలి సార్ అంటూ ప్రశ్నించారు. ఏం చేస్తారు..? మేమంతే చేస్తం అంటూ ఎమ్మెల్యే చెప్పడం గమనర్హం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొంతసేపు ఉద్రికత్తకు దారితీసింది. స్థానిక ఎస్సై ఎంపీటీసీ బొందయ్యను నెట్టివేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. అయితే అక్కడ కొంత మంది నాయకులు, పోలీసులు కల్పించుకుని గొడవను సద్దుమనిపించారు.


Similar News