సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి 10, 000 ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
దిశ, వైరా : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి 10, 000 ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వర్షాలకు కౌలు రైతులు అధికంగా నష్టపోయిన నేపథ్యంలో వారికి వెన్నుదన్నుగా ఉంటానని, కౌలు రైతులకు నేరుగా పరిహారం చెల్లిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని తెలిపేందుకు సీఎం కేసీఆర్ ప్రకటన ఉదాహరణ అన్నారు.
భవిష్యత్తులో రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. అలాగే రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో వైరా నియోజకవర్గంలోని ముస్లిం నివాస మసీదులను శుభ్రం చేయడంతో పాటు నీటి సదుపాయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.