గడపగడపకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
గత నాలుగు రోజులుగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పట్టణంలో గడపగడప కార్యక్రమం... MLA Haripriya Visits illandu
దిశ, ఇల్లందు: గత నాలుగు రోజులుగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పట్టణంలో గడపగడప కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వార్డుల పర్యటన కొనసాగుతుంది. గురువారం మున్సిపల్ పరిధిలోని 14 నుంచి 19 వార్డులలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు, అభివృద్ధి పనులను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్లు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.14 కోట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు అభివృద్ధి కొరకు రూ.50 లక్షలు కేటాయించినట్లు, నేరుగా ప్రజలతో చర్చించి పనులను పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీకి రాష్ట్ర, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, దాని కొరకు పాలకవర్గ కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా, కమిషనర్ అంకుషావలి, అయ్యప్ప స్వామి టెంపుల్ చైర్మన్ ఎల్. కృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ అక్కిరాజు గణేష్, మున్సిపల్ డీఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్, మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.