Minister : ప్రభుత్వ స్థలాలను కాపాడండి

Update: 2024-08-08 11:50 GMT

దిశబ్యూరో, ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాకు వచ్చిన హౌసింగ్ కమిషనర్, స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి విపి గౌతమ్, జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలు మర్యాపూర్వకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను సంరక్షించడంతో పాటు ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వినియోగించాలని కోరారు. ఈ క్రమంలో ఖమ్మం నగరంతో పాటు రఘునాధపాలెం మండలంలోని ప్రభుత్వ భూములను సైతం అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. గోళ్లపాడు ఛానెల్ పెండింగ్ పనులు నాణ్యత ప్రకారం పూర్తి చేయాలన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్కును ఏకో టూరిజియం పార్కుగా చేయాలన్నారు. అదేవిధంగా పార్క్ వెళ్లే రహదారి డబల్ రోడ్డు గా పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని సైతం సుందరంగా ఉంచాలన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు డివైడర్ల లో మొక్కలు వేయడంతో పాటు అందంగా తీర్చిదిద్దాలన్నారు. ఖమ్మంలో మరో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చూడాలని ఆదేశించారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Tags:    

Similar News