గంజాయి,డ్రగ్స్ నిర్మూలనకు మీడియా మిత్రులు,ప్రజలు సహకరించాలి :సీపీ సునీల్ దత్

గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Update: 2024-10-22 08:34 GMT

దిశ,సత్తుపల్లి: గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా సీపీ సునీల్ దత్ అన్నారు. మంగళవారం కల్లూరు డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి,మత్తు పదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సీపీ సునీల్ దత్ కు కల్లూరు ఏసీపీ అని శెట్టి రఘు, సత్తుపల్లి పట్టణ సీఐ టీ కిరణ్ పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్వహించి,అవగాహన సదస్సులో జిల్లా సీపీ  సునీల్ దత్ మాట్లాడుతూ, యువత చిన్న వయసులో మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి సేవించే వారికి విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లా లో సత్తుపల్లి శివారు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కావడం తో తరచూ గంజాయి,మత్తు పదార్థాల రవాణా కు అడ్డాగామారుతుందని,గంజాయి, మత్తు పదార్థాలు తరలింపు దారుల పై పోలీస్ శాఖ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై పిల్లల తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ మంచి మార్గం వైపు నడుచుకునేలా ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల పట్టుబడిన 94 మంది గంజాయి, సేవించే యువతకు సమాజంలో మంచి పౌరులుగా మరెందుకు ఒక్క అవకాశం కల్పిస్తున్నట్లు వారి ప్రవర్తన పై నిరంతర పోలీస్ శాఖ పర్యవేక్షణ ఉంటుందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరివర్తన కలిగి యువత ఉన్నత లక్ష్యంతో సమాజంలో మంచి పౌరుడుగా రాణించాలని కోరారు. సమాజంలో మీడియా మిత్రులతో పాటు ప్రతి పౌరుడు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరి బాధ్యతగా సేకరించి పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా సీపీ తెలిపారు.

అనంతరం కల్లూరు ఏసీపీ అని శెట్టి రఘు మాట్లాడుతూ, గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిస అవటంతో మత్తు పదార్థాలు మెదడు, నాడీ వ్యవస్థ పై పనిచేయడం తో గంజాయి సేవించిన వారు విచక్షణ కోల్పోయి ప్రవర్తించటం జరుగుతుందని పిల్లల కదలికలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని ఆయన కోరారు. తదనంతరం జిల్లా ఎస్పీ స్థానిక పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్, రికార్డులను పరిశీలించి క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి నిర్మూలనకు నిరంతర నా పర్యవేక్షించి నిర్మూలనకు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవగాహన సదస్సులో రూరల్ సీఐ ముత్తు లింగం, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, తల్లాడ, మండలాలకు చెందిన ఎస్సైలు, ఏఎస్ఐ లు, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News