ఎదురు కాల్పులలో మావోయిస్టు మృతి

Update: 2024-10-08 04:56 GMT

దిశ భద్రాచలం: పోలీసు-నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులలో కిస్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేష్ మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పామలూరు గ్రామ అటవీ-కొండలో పోలీసు-నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు సభ్యుల ఉనికి గురించి సమాచారం అందుకున్న డి‌ఆర్‌జి , బస్తర్ ఫైటర్, 206 కోబ్రా, 208 కోబ్రా, 131 సీఆర్పీఎఫ్ దళాల ఉమ్మడి బృందం ఆధ్వర్యంలో దబ్బకొండ, అంతపాడ్ బుర్కలంక, పామ్లూర్, సింఘనమడ్గు, పరిసర ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. దీనిలో భాగంగా భద్రతా బలగాలకు మావోలు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయు. ఈ కాల్పులలో మావోయిస్టు ఏసిఎం లోకేష్ మృతి చెందాడు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఎదురు కాల్పులలో గాయాలు అయి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


Similar News