చికాగో అమరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం : ఐఎఫ్టీయూ న్యూ డెమోక్రసీ
కార్మిక హక్కుల రక్షణ కోసం చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మికులోకం పోరాడాలని కూసుమంచి మండల కేంద్రంలో ఐఎఫ్టీయు హమాలి గ్రామపంచాయతీ భవన నిర్మాణం కార్మికుల న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
దిశ, కూసుమంచి : కార్మిక హక్కుల రక్షణ కోసం చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మికులోకం పోరాడాలని కూసుమంచి మండల కేంద్రంలో ఐఎఫ్టీయు హమాలి గ్రామపంచాయతీ భవన నిర్మాణం కార్మికుల న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో జండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హమాలి వర్కర్స్ యూనియన్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక యూనియన్, న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి, గోపి రవి లు మాట్లాడుతూ అమెరికాలో 137 సంవత్సరాల క్రితం ఎట్టి చాకిరీ వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని పోరాడుతున్నటువంటి కార్మికులను రాజ్యం బలి తీసుకున్న మొక్కవోని ధైర్యంతో ప్రపంచ కార్మికులు ఏకమై ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించారని అన్నారు.
అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో నాలుగు లేబర్ కోడులుగా చేయటం ద్వారా కార్మికుల శ్రమను దోచుకునే విధంగా వీలు కల్పించినట్లు అయిందని కార్మికులు హక్కులు కోసం పోరాడకుండా సంఘాలు పెట్టకుండా బానిసల్లాగా ఉండే విధంగా రూపొందించినవే ఈ నాలుగు లేబర్ కోడ్ లు అని అన్నారు. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసే దాంట్లో భాగంగా రాజ్యాంగ నీ రద్దుచేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని బీజేపీ చూస్తుందని అందుకే మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతుందని మైనార్టీల మీద దాడులు జరుపుతుందని ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు.
మోడీ అధికరాలకు వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మి ఉన్న ఉద్యోగాలు కూడా కూడా పీకుతున్నాడని అన్నారు. దేశంలో కరోనాతో అనేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు నిత్యవసర రేట్లు పెంచి పెట్రోల్ డీజిల్ వంటగ్యాసు ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు హమాలీ గ్రామపంచాయతీ వర్కర్స్ భావన నిర్మాణ కార్మికులకు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికులను 24 గంటలు పని చేయించుకొని చాలీచాలని జీవితం 8500 ఇస్తున్నారని, ఈ బంగారు తెలంగాణలో గ్రామపంచాయతీ వర్కర్స్ నేలకు 26 వేల రూపాయలు ఇచ్చి వారికి భద్రత కల్పించాలని అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి చెరుకుపల్లి వీరయ్య, జిల్లా నాయకులు తాళ్లూరి మురళీధర్ రావు, బుర్ర సైదులు, భక్తుల ఉప్పలయ్య, ఆర్ సంజీవరావు హమాలి వర్కర్స్ యూనియన్ కూసుమంచి మండల కార్యదర్శి కాంపాటి మధు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కూసుమంచి మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము అశోక్, కొక్కిరేణి గణేష్, పి వీరయ్య, కే.గురవయ్య, జి సత్యం ,జి భిక్షం, జి వెంకటేష్, హరిమూర్తి, ప్రవీణ్, రమేష్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు, సాయి నరసింహారావు, మధు, వెంకన్న, భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర నాయకులు దాట్ల వీరస్వామి, పోకల వెంకన్న, వేల్పుల వెంకన్న, మైసయ్య, వీరయ్య, చల్ల శీను, హమాలి వర్కర్స్, కే నాగన్న, ఎం రమేష్, ఎన్ నరేష్, వి అనిల్, కే గోపయ్య, జి.నాగేశ్వరావు, ఎం.పవన్, కే.నాగేశ్వరావు, డి.పిట్టయ్య, సిహెచ్.రామ్మూర్తి, పి.సత్యం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.