ప్రభుత్వ పాఠశాలలో పురుగుల బీభత్సం

వైరా మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పురుగుల... Latest News

Update: 2023-03-16 07:38 GMT

దిశ, వైరా: వైరా మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పురుగుల బీభత్సం నెలకొంది. ఈ పురుగుల బీభత్సంతో పాఠశాలలోని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. గత నెల రోజులుగా ఈ పాఠశాలలో పురుగులు స్వైర్య విహారం చేస్తున్నాయి. ఈ పురుగులు కుట్టటంతో విద్యార్థుల శరీరంపై దద్దులు వస్తున్నాయి. నెల రోజులుగా పురుగులతో ఈ పాఠశాల విద్యార్థులు సహజీవనం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ పురుగులను నిర్మూలించేందుకు పురుగు మందులు, బ్లీచింగ్ పిచికారీ చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఈ పాఠశాల పక్కనే ఉన్న చింత చెట్టు వద్ద నుంచి ఈ పురుగులు వస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ పురుగుల ఉధృతిని తట్టుకోలేక గురువారం పాఠశాలనే మార్చి వేశారు. ఈ పాఠశాలలో మొత్తం 11 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పురుగులు కుట్టటం వల్ల విద్యార్థులందరికీ దద్దులు వస్తున్నాయి. ఈ పాఠశాల విద్యార్థులను గురువారం గ్రామ మాజీ సర్పంచ్ కొరకొప్పు వెంకటరత్నంగా ఇంటికి తరలించి అక్కడ విద్యాబుద్ధులు నేర్పారు. పురుగుల వల్ల పాఠశాలను తాత్కాలికంగా మాజీ సర్పంచ్ వెంకటరత్నం ఇంట్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రాథమిక పాఠశాలలో పురుగులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News