Kono Corpus Plants : కొనో కార్పస్ మొక్కలు చాలా డేంజర్..

వృక్షో రక్షతి రక్షితం అంటారు పెద్దలు.. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే అన్ని చెట్లు అలాంటివి కావలి పర్యావరణ వేత్తలు అంటున్నారు.

Update: 2024-07-29 16:16 GMT

దిశ, తల్లాడ : వృక్షో రక్షతి రక్షితం అంటారు పెద్దలు.. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే అన్ని చెట్లు అలాంటివి కావలి పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కర్పస్ పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. ఈ వృక్షం ఇప్పటికే మన దేశాన్ని కలవరపెడుతుంది. శాఖల రూపంలో ఉండే కోనో కార్పస్ అమెరికా ఖండంలో తీర ప్రాంతం మొక్క ఇది. ప్రధానంగా ఉత్తర అమెరికాలోని క్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రోవ్ జాతి మొక్క వేగంగా పెరిగే ఈ చెట్టు పచ్చదనాన్ని అంతరించుకొని ఆకర్షణీయంగా ఉంటుంది.

వన్యప్రాణులకు సంకటం..

వేరే ఖండాల నుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సముతుల్యతకు విఘాతమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీంతో హార్బి వోర్స్ (గడ్డి తినే జంతువులకు) ఆహార కొరత ఏర్పడి అది కార్నివోర్స్ మాంసాహార జంతువులు ఉనికికే ప్రమాద కారణమవుతుంది. కోనో కార్పస్ తో కూడా ఇలాంటి సమస్యలను తలెత్తుతున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్యపచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను గట్టి ఎరగనియ్యకుండా, అలాగే పక్షులకు తమ జీవవర్ణంతో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజరక్షణలో గూళ్లు కట్టుకోవడం వైఫల్యం చెంది పునరావత్పత్తి కోల్పోతుంది.

పలు ఆరోగ్య సమస్యలకు కారణం..

కోనో కార్పస్ మొక్క పర్యావరణాన్ని హని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుంది. పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనలు తేల్చింది. గాలిలో ఎక్కువ సంఖ్యలో కనిపించడం అవి కోనో కార్పస్ పుష్పలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిర్వేదించండి, అధిక సంఖ్యలో భూగర్భ జలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్ దేశాలు గుర్తించాయి.

తల్లాడ పంచాయతీ ఈవో కృష్ణరావు వివరణ..

తల్లాడ పట్నంతో పాటు పల్లె పకృతి వనంలో ఉన్న కార్పస్ మొక్కలను తొలగిస్తామని, అలాగే చెట్ల వల్ల ప్రాణాపాయ వ్యాధులు సక్రమించే అవకాశం ఉన్నందున వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని, వాటి స్థానంలో వేరే చెట్లు నాటి ఆక్సిజన్ అందించే మొక్కలను వేస్తామని తెలిపారు. అందులో భాగంగా గానుగా, వేప, పూలు, పండ్ల మొక్కలను వేస్తామని తెలిపారు. తల్లాడ పట్టణంలోని డివైడర్ చుట్టూ కూడా మంచి మొక్కలను వేస్తామన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య మెరుగు కోసం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News