కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకపోతే కీళ్లు ఇరుగుతాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్
కేటీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో
దిశ,మణుగూరు : కేటీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు..లేదంటే కీళ్లు ఇరుగుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.పొంగులేటి గురించి మాట్లాడే దమ్ము నీకు,నీ అయ్యా కేసీఆర్ కు లేదని ఘాటుగా విమర్శించారు.ఓ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలకు ఎమ్మెల్యే పాయం స్పందించారు. సోమవారం ఆయన మణుగూరు ప్రజా భవన్ కార్యాలయంలో మాట్లాడుతూ కేటీఆర్ పొంగులేటి గురించి ఒక్క మాట మాట్లాడిన నీకు ఈపు చింతపండు అవుతుందని హెచ్చరించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేల్చే మొట్ట మొదటి కేటీఆర్ అవుతారని..ఆ బాంబుకు కేటీఆర్ ఎగిరిపోవడం ఖాయమని..సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఎవరు వచ్చి కాపాడుతారో మేము చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.మమ్మల్ని వదిలిపెట్టమని కుక్క వాగుడు కాదు కేటీఆర్..నిన్ను,నీ అయ్యాని వదిలిపెడతామో లేదో నువ్వే చూస్తావ్ గా అంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దమ్ము ఏంటో ఎన్నికల ముందు చూశారు కదా..మళ్ళీ రెచ్చకొడితే ఈసారి నువ్వు,నీ పార్టీ ఫారన్ కి పారిపోవలసి వస్తుందని గుర్తు పెట్టుకో అని కీలక వ్యాఖ్యలు చేశారు.