మద్యం మత్తులో యువకుల హాల్ చల్..

మద్యం మత్తులో కొందరు యువకులు ఈ మధ్యకాలంలో హల్ చల్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Update: 2023-08-06 16:21 GMT

దిశ, నేలకొండపల్లి: మద్యం మత్తులో కొందరు యువకులు ఈ మధ్యకాలంలో హల్ చల్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు పోకిరిలు నడి రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ దాడులకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టిశ్రీరాములు సెంటర్లో కొందరు యువకులు మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం హాల్ చల్ సృష్టించినట్లు తెలుస్తుంది.

రోడ్డుపై మద్యం సేవిస్తూ అటూ వైపు నుండి వెళ్తున్న మారో యువకుల వర్గంపై గొడవకు పూనుకున్నారు. తరచూ ఈ ప్రాంతంలో యువకులు మద్యం తాగుతూ గొడవలకు పూనుకుంటున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


Similar News