photo exhibition : కలెక్టరేట్​లో ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్, స్టాల్స్

ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై, వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ఆకట్టుకున్నాయి.

Update: 2024-10-25 12:49 GMT

 దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై, వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ (photo exhibition), స్టాల్స్ ఆకట్టుకున్నాయి. వీటిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev varma) తిలకించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నఆయనకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వివిధ శాఖల ద్వారా ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. పర్యాటక ప్రదేశాలపై సమాచార శాఖ, జిల్లా పర్యాటక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ పరిశీలించారు. జిల్లాలోని జాఫర్ బావి, ఖమ్మం ఖిలా, లకారం లేక్ సస్పెన్షన్ బ్రిడ్జి, వైరా లేక్, పాలేరు రిజర్వాయర్, బోటింగ్, నేలకొండపల్లిలోని బుద్ధ స్తూపం, జమలాపురం వేంకటేశ్వర స్వామి టెంపుల్, కూసుమంచి శివాలయం, కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ మొదలైన పర్యాటక ప్రదేశాల వివరాలను కలెక్టర్ వివరించారు.

    వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ లో పంట రుణమాఫీ, డ్రం సీడర్ పద్ధతిలో వరి సాగు, సేంద్రియ వ్యవసాయం, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం, రైతులకు కలిగే ప్రయోజనాలు తెలుపుతూ ప్రదర్శించిన వాటిని గవర్నర్ పరిశీలించి అభినందించారు. గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షకులు, విద్యార్థినులు తయారు చేసిన చేతి వృత్తులను, ఇందిరా మహిళా శక్తి కి చెందిన చాగంటి లావణ్య మిల్లెట్ స్నాక్స్, సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రదర్శనను గవర్నర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.

Tags:    

Similar News