ప్రభుత్వ భూమిలో అక్రమ డంపింగ్..!
అక్రమార్కులకు కంటికి కనిపిస్తే చాలు దానిని క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమౌతారు. అది ప్రభుత్వ భూమి అయితే ఇంకా అడ్డేముంది.
దిశ, ఖమ్మం రూరల్ : అక్రమార్కులకు కంటికి కనిపిస్తే చాలు దానిని క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమౌతారు. అది ప్రభుత్వ భూమి అయితే ఇంకా అడ్డేముంది. ఇష్టారాజ్యంతో వ్యవహరించడంతో పాటు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడని విధంగా డంపింగ్ చేస్తున్నారు.. కొంతమంది అక్రమార్కులు ఇదంతా రూరల్ మండలం వెంకటగిరి ప్రాంతంలో సాగుతున్నది. రూరల్ మండలం గుదిమళ్ల రెవెన్యూ గ్రామమైన వెంకటగిరిలో హైవేకి దగ్గరలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రానైట్ రాళ్లను డంపిగ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిలో సుమారు 40 అడుగులకు పైగా ఎత్తులో డంపింగ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి కోదాడ టూ ఖమ్మం హై కి దగ్గరలో ఉండటంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరమైన అవసరాలకు వినియోగించాలంటే ఇంత పెద్ద డంప్‌ను తరలించేది ఎట్లా అనేది పెద్ద ప్రశ్న. వెంకటగిరి రెవెన్యూ ముదిగొండకు సమీపంలో ఉండటంతో అక్కడ ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే గ్రానైట్ రాళ్లను కొందరు టిప్పర్లతో ప్రభుత్వ భూమిలో గత నెలలుగా డంపింగ్ చేస్తున్నారు. పేదలకు ఇండ్ల ఇవ్వాలన్న, ఎదైన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్న ఈ డంపింగ్ తరలించడం కత్తి మీద సాము లాంటిదే. అక్రమణదారులు తమ ఇష్టం వచ్చినట్లు డంప్ చేసి క్యాష్ చేసుకోవడమే పనిగా నిమగ్నమయ్యారు.
సొమ్ము చేసుకుంటున్న అక్రమణదారులు..
అక్రమణదారులు ఒక్కొ టిప్పర్ రాళ్లను గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి తరలించేందుకు సుమారు ఆరు వందలకు పైగానే కిరాయి తీసుకుని వారికి ఇష్టం వచ్చిన చోట డంపింగ్ చేయడం వీరి పని. అక్రమణదారులు ప్రభుత్వ భూమితో పాటు గుర్రలపాడు నుంచి ముదిగొండ రహదారి పక్కన కూడ పోయడంతో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. రహదారి పక్కనే రాళ్ల వేయడం వలన ఏదైనా టూవీలర్ కానీ, కారు ఇతరత్రా వాహనాలు దారి తప్పితే వారి జీవింతం అధోగతిపాలే. అటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అయిన కానీ అక్రమంగా డంపింగ్ చేయడం వారు ఆపకపోగా వారు ఇష్టం వచ్చినట్లు పోయడం క్యాష్ చేసుకోవడమే వారి పని.
డంపింగ్ చేయాలంటే ఎదైనా పాతక్వారీలో డంపింగ్ చేయాలన్నా నిబంధన కూడా ఉంది. రూరల్ మండలంలోని పోలేపల్లి పరిధిలో ఓ పాత క్వారీలో డంపింగ్ వేసుకొనుటకు అనుమతి ఇచ్చిన అక్రమణదారులు మాత్రం తమకు ఇష్టం వచ్చిన చోట పోసి ఇటు ప్రజలను అటు ప్రభుత్వ స్థలాలకు అడ్డంకిగా మారుతున్నారు. ఇటువంటి అక్రమణ డంపింగ్‌ల పై అధికారులు సమగ్ర దృష్టిసారించి మండలంలో సాగుతున్న అక్రమ డంపింగ్దారుల పై తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.