పిలిస్తే పలుకుతాం

పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలూ తాము అందుబాటులో ఉంటామని, ఏ క్షణంలో పిలిచినా పలుకుతామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-10-20 09:40 GMT

దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలూ తాము అందుబాటులో ఉంటామని, ఏ క్షణంలో పిలిచినా పలుకుతామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పలు రకాల సమస్యలతో బాధపడుతూ నిత్యం ఎంతోమంది బాధితులు పొంగులేటి కార్యాలయం తలుపు తడుతున్నారని, వెంటనే న్యాయపరమైన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించి పంపిస్తున్నామని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడిన ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని కేబీఆర్ నగర్ రెండు, మూడు కాలనీల్లో దయాకర్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ప్రస్తుతం వారి స్థితిగతులను పరిశీలించారు. కాలనీలో వేయాల్సిన రోడ్లు, డ్రైనేజీ తదితర వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు.

     త్వరలోనే వాటిని మంత్రి పొంగులేటి చొరవతో నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. పాలేరు మంత్రి పొంగులేటి సొంతిల్లని ఇక్కడి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో కొత్త పుంతలు తొక్కించాలనే ధ్యేయంతో మంత్రి ముందుకు సాగుతున్నారని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి రోడ్డు, డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. ఇక్కడి ప్రజల సంక్షేమ బాధ్యత ఆయనదేనని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఓ ఉపాధ్యాయురాలిని సన్మానించారు. పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలు, ఇతర శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, అజ్మీరా అశోక్ నాయక్, బాణోతు కిషోర్ నాయక్, బాణోతు దివ్య, బాణోతు హరి, ధరావత్ నారాయణ, బాణోతు సాయి, గుగులోత్ శ్యామ్ ఉన్నారు.

Tags:    

Similar News