కూసుమంచి శివాలయంలో హుండీ చోరీ..
కూసుమంచి మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి పురాతన గణపేశ్వరాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. ఆలయంలోని
దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి పురాతన గణపేశ్వరాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులో నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు చోరికి పాల్పడుతున్న తీరు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ.5వేలకు పైగా నగదు ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు నెలల కాలంలో చోరికి పాల్పడటం ఇది రెండో సారి. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.