ఘనంగా జీవీమాల్ ఓపెనింగ్

ఖమ్మం నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన జీవీమాల్ ప్రారంభోత్సవం శనివారం ప్రముఖ సినీనటి కీర్తిసురేష్, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

Update: 2024-10-05 09:08 GMT

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : ఖమ్మం నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన జీవీమాల్ ప్రారంభోత్సవం శనివారం ప్రముఖ సినీనటి కీర్తిసురేష్, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటి కీర్తిసురేష్ చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వచ్చిన ప్రేక్షకులతో ఫొటోస్ దిగుతూ సందడి చేశారు.

    ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం గడ్డమీదపుట్టి వ్యాపార లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి జీవీమాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరావు అని కొనియాడారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెలిశాయని, వాటన్నిటితో పోటీపడుతూ ఎక్కడా రాజీ పడకుండా సంపదతో సంబంధం లేకుండా సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ గత 70 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారని కొనియాడారు.

     ఈ కార్యక్రమంలో మంత్రి తొలిసారిగా రిమోట్ కంట్రోల్ తో అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఓపెన్​ చేశారు. జీవీ మాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నామని, క్వాలిటీతో సరసమైన ధరలకు వస్త్రాలను అందించడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. జీవి మాల్ సంస్థ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ కలిపి 17 బ్రాంచ్​లు ఓపెన్​ చేశామని, ముందు ముందు కూడా ఇలాగే కష్టపడుతూ ప్రజలకు నాణ్యమైన సరసమైన ధరలకు దుస్తులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కామార్ధపు మురళి, తుంబూరి దయాకర్ రెడ్డి, పునకొల్లు నీరజ పాల్గొన్నారు. 

Tags:    

Similar News