సింగరేణి దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 23న సింగరేణి దినోత్సవం సందర్భంగా బ్లాక్ డైమెండ్ స్టేడియం, జేకే కాలనీలో నిర్వహించే వేడుకల ప్రదేశాన్ని ఏరియా జీఎం విసం కృష్ణయ్య శనివారం పరిశీలించారు.
దిశ, ఇల్లందు : ఈ నెల 23న సింగరేణి దినోత్సవం సందర్భంగా బ్లాక్ డైమెండ్ స్టేడియం, జేకే కాలనీలో నిర్వహించే వేడుకల ప్రదేశాన్ని ఏరియా జీఎం విసం కృష్ణయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్, తెలంగాణ రుచులతో కూడిన స్టాల్స్, సింగరేణి పుట్టినిల్లు చరిత్ర ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నామని, వాటికీ తగినవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
అలాగే వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, తాగునీరు, షామీయానాలు, అంబులెన్స్, ప్రథమ చికిత్స కోసం డాక్టరు, సిబ్బంది ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజీఎం బొల్లం వెంకటేశ్వర్లు డీజీఎం (ఇ&యం) నాగరాజు నాయక్, డీజీఎం పర్సనల్ జీవీ మోహన్ రావు, ఏరియా ఇంజనీర్ నరసింహరాజు, డీజీఎం (సివిల్) రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.