హోమియో వైద్యులు గోపాలరావుకు ఘన సన్మానం
మాస్టర్ ఈకే వైద్యాలయంలో ప్రముఖ హోమియో వైద్యులు గోపాలరావు అందించిన సేవలు అనిర్వచనీయమని పలువురు పేర్కొన్నారు.
దిశ, కొత్తగూడెం : మాస్టర్ ఈకే వైద్యాలయంలో ప్రముఖ హోమియో వైద్యులు గోపాలరావు అందించిన సేవలు అనిర్వచనీయమని పలువురు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ నిర్వాహకులు అంబారుఖాన శ్రీధర గోపాలరావు సంస్థ ప్రధాన కార్యాలయం విశాఖపట్నం వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మాస్టర్ ఉచిత వైద్య సేవలను వేలాది మందికి అందించారని కొనియాడారు. కరోనా సమయంలో కూడా భయపడకుండా వైద్యం చేయడమే కాకుండా, సభ్యుల ఇండ్లకు సైతం వెళ్లి వైద్య సేవలు అందించారన్నారు. సంస్థ కోసం అనేక త్యాగాలు చేశారన్నారు.
అనేక రకాల మొండి వ్యాధులను తగ్గించుకున్న వారు మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ రావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తూనే వైద్య సేవకు మాస్టర్ కల్పించిన అవకాశాన్ని, కుటుంబ సభ్యుల సహకారంతో సద్వినియోగం చేసుకున్నానన్నారు. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సంస్థ అభ్యున్నతికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాస్టర్ పిలుపుమేరకు తాము విశాఖపట్నం వెళ్తున్నట్టు చెప్తూ ఒకింత బావోధ్వేగానికి లోనయ్యారు.
అనంతరం గోపాలరావు -పద్మిని దంపతులను శాలువాలతో సత్కరించి, పూలమాలలతో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారిలో ఆవుల శ్రీకాంత్, కమల, సుబ్బారావు, మొక్కల వెంకటయ్య, సుగుణారావు, శ్రీనివాసరెడ్డి, పిచ్చయ్య, కోటేశ్వరరావు, నాగమణి, పద్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వారి కుమారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మిత్ర బృందం సభ్యులు లత, శిరీష, సునీత, రమాదేవి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.