Special buses : అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త..
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు భద్రాచలం ఆర్ టి సి శుభవార్త తెలిపింది.
దిశ ,భద్రాచలం : తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు భద్రాచలం ఆర్ టి సి శుభవార్త తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ..నవంబర్ 15న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టి జి ఆర్ టి సి భద్రాచలం నుంచి నడపాలని నిర్ణయించింది. ఈ బస్సు నవంబర్ 13 న రాత్రి 8 గంటలకు భద్రాచలం బస్టాండ్ నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం (గోల్డెన్ టెంపుల్ ) లను దర్శింపచేసి.. 14 వ తేది రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుతుంది. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత నవంబర్ 15 వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి నవంబర్ 16 వ తేదీ సాయంత్రం 4 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.4 వేలు గా సంస్థ నిర్ణయించింది. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ దగ్గరలోని బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చని..ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 7386326102,7382856625 9347797952 ఫోన్ నంబర్లను సంప్రదించగలరని భద్రాచలం డిపో మేనేజర్ బి. తిరుపతి తెలిపారు.