ఆలయాల్లో చోరీ చేసే దొంగల ముఠా అరెస్ట్

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో వరుసగా పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-23 11:26 GMT

దిశ,సత్తుపల్లి : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో వరుసగా పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్​ చేశారు. సత్తుపల్లి ఏసీపీ కార్యాలయంలో కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు కేసు వివరాలను తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మండలం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఎల్లబోయిన గోపి, అద్దంకి గురవయ్య, అద్దంకి శివ, ముంగి రాము, ముంగి కృష్ణ అలియాస్​ కిట్టువీరు తో పాటు బాల నేరస్తుడు కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు.

     మధిర, బోనకల్లు, వత్సవాయితో పాటు ఆగస్టు 18న అచ్చంపేటలో సత్తెమ్మ తల్లి గుడిలో దొంగతనం చేశారు. ఆగస్టు 28న వేంసూరు మండలం వెంకటాపురం దేవాలయంతో పాటు పలు ఆలయాల్లో హుండీలోని నగదు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వీరిని అరెస్ట్​ చేశారు. కిరీటాలు, సూత్రాలు కరిగించగా రూ, 20 వేలు, హుండీలో దొంగిలించిన సొత్తు లక్ష యాభై వేలు, 3.3 కిలోల వెండి, దొంగతనానికి ఉపయోగించిన 2 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆరుగురిని సత్తుపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, వేంసూర్ ఎస్సై వీరప్రసాద్, పోలీస్ సిబ్బందిని ఖమ్మం పోలీస్​ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. సిబ్బందికి రివార్డు అందించారు.  

Tags:    

Similar News