ప్రశ్నిస్తే దాడి చేస్తారా.. పోలీసులా గులాబీ కార్యకర్తలా..? మాజీ ఎంపీ పొంగులేటి ఫైర్

వైఎస్సార్ కాలనీలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని.. జాబితాలో ఉన్న కొంతమంది అర్హుల పేర్లను మాయం చేశారని ఆరోపిస్తూ

Update: 2023-10-03 15:04 GMT

దిశ, ఖమ్మం బ్యూరో: వైఎస్సార్ కాలనీలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని.. జాబితాలో ఉన్న కొంతమంది అర్హుల పేర్లను మాయం చేశారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, కొంతమంది తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన కులానికి చెందిన మహిళలు, యువకులు, స్థానికులు మంత్రి అజయ్ని నిగ్గదిస్తే వారిపై మంత్రి అనుచరులు, పోలీస్ సిబ్బంది దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పోలీసులు గులాబీ కార్యకర్తల్ల వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

బాధితులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా వారి పైనే కేసులను పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రోటో కాల్ ప్రకారం కనీసం స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్‌కి సమాచారం ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సింది పోయి నిగ్గదీసిన వారి పై దాడి చేయడం భావ్యం కాదని.. ఈ ఘటనకు మంత్రి పూర్తి భాధ్యత వహించాలన్నారు. క్షమాపణలు కూడా చెప్పాలన్నారు. విచారణ చేయించి అర్హులైన లబ్ధదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అదే విధంగా తమ పార్టీ నేతలు, స్థానికులపై అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News