పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి

భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2024-09-07 12:29 GMT

దిశ, పాల్వంచ టౌన్ : భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణ పరిధిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన పలు మండపాలను శనివారం సందర్శించి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కునంనేని మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ, పాటిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలను మెరుగుపర్చాలన్నారు.

    ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారత దేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేషాలకు దూరంగా ఉంటారని, తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ఉత్సవ కమిటీలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సాంప్రదాయమని, దీనిని భవిష్యత్తులో కొనసాగించి పలువురికి ఆదర్శంగా నిలవాలని కోరారు. పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలకు హాజరైన కూనంనేనిని కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News