పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు 'కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మైక్రో బయాలజీ, కామర్స్, ఇంగ్లీష్' బోధన కోసం పార్ట్ టైం

Update: 2024-09-16 13:23 GMT

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు 'కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మైక్రో బయాలజీ, కామర్స్, ఇంగ్లీష్' బోధన కోసం పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా పనిచేయుటకు ఆసక్తిగల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55 శాతం మార్కులు పొంది ఉండాలని చెప్పారు. పిహెచ్.డి, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.అభ్యర్థులు తమ దరఖాస్తులకు, సర్టిఫికెట్ కాపీలను జతచేసి 'సెప్టెంబర్ 17' మంగళవారం ఎస్.బి.సి.ఈ విద్యాసంస్థల క్యాంపస్, కోదాడ క్రాస్ రోడ్ మద్దులపల్లి ప్రాంతంలో ఉన్న గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించబడే రాత పరీక్ష, డెమో కు హాజరుకావాలని డాక్టర్ శర్మ తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్, డిమోలోని మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకం ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. వివరాలకు డాక్టర్ సునీత వైస్ ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ 95154 35518 సంప్రదించవలసినదిగా ప్రిన్సిపాల్ కోరారు.


Similar News