MLA Koonanneni : దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న నవరాత్రి ఉత్సవాలు

వీధి వీధిన, గ్రామ గ్రామాన ఉల్లాసంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నాయని

Update: 2024-09-16 13:59 GMT

దిశ,కొత్తగూడెం : వీధి వీధిన, గ్రామ గ్రామాన ఉల్లాసంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నాయని, భవిష్యత్తు తరాలకు ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతిపై గౌరవాన్ని పెంచుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం పట్టణ, పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మంటపాలు సోమవారం సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల మహా అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల్లో ఐకమత్యాన్ని, సంబంధాలు మెరుగుపర్చేందుకు ఉత్సవాలు దోహదం చేస్తాయని అన్నారు. ప్రతియేటా క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహిస్తూ సంస్కృతిని గౌరవించడం అభినందనీయమని, అందుకు ఉత్సవ కమిటీలు చేస్తున్న కృషిని కొనియాడారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రభుత్వ శాఖలు, పోలీస్ శాఖలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, వాసి రెడ్డి మురళి, నేరెళ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News